వేసవి కాలంలో ఎంతో మేలును చేసే మజ్జిగ గురురించి తెలుసుకుందం
మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి.
1. తక్రం
2. మధితం
3. ఉదశ్విత్తు.
🔸 తక్రం
నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం.
🔸 మధితం
అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది,
కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.
🔸 ఉదశ్విత్తు
సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు.
ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.
🔸 మజ్జిగ - మహా పానీయం
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి,తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ,
విషదోషాలు,దుర్బలత్వం,చర్మరోగాలు,దీర్ఘకాలిక వ్యాధులు,కొవ్వు , అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరంలో ఉన్నది. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ,ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట.. వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది.పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.
మజ్జిగ ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది,అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.
వేసవి కోసం ప్రత్యేక కూర్చిక పానీయం..
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని కూర్చిక అంటారు.
ఇందులో పంచదార, ఉప్పు బదులుగా వీటిని కలపండి. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి...మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి...దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి.
కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది.
ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి... ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది.
ఎండలోకి వెళ్లబోయే ముందు మజ్జిగను ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.
చక్కగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసు నిండా తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయ రసం,తగినంత ఉప్పు (సైంధవ లవణం),పంచదార,చిటికెడంత తినేసోడా ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకోసారి త్రాగండి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే ...ఒక సీసా నిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి ...మాటి మాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.


